ఈ కుర్రాడ్ని చూశారా, ఇదీ అవసరమే...
ఆధునిక సమాజం చాలా సంక్లిష్టంగా మారింది.
ఆధునిక సమాజం చాలా సంక్లిష్టంగా మారింది. హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఎప్పుడు ఏ ఆపద వచ్చి పడుతుందో తెలియదు. అందుకుని ప్రతి ఒక్కరు ఆత్మరక్షణ పద్ధతులు నేర్చుకోవడం చాలా అవసరం. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం పొందితే జీవితంలో పనికి వస్తాయి. దుండగులు దాడి చేసినప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి వీలవుతుంది. వాటిని ఆత్మరక్షణ కోసం వాడాలి తప్ప తప్పుడు పనులు చేయడానికి వాడుకూదనే సందేశం అభ్యాసంలోనే నేర్చుకోవాలి. అందుకని ప్రతి ఒక్కరు తమ పిల్లలకు ఆత్మరక్షణ పద్ధతులను బాల్యం నుంచే నేర్పిస్తే ఎంతో మేలు జరుగుతుంది. తమ పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని ఆశిస్తూ పుస్తకాలతో ప్రతి నిత్యం కుస్తీ పట్టించడం చూస్తున్నాం. అయితే, కరాటే వంటి పద్ధతులను నేర్చుకోవడానికి పిల్లలను ప్రోత్సహిస్తే వారికి కొంత ఉల్లాసం కూడా కలుగుతుంది. చదువును కాసేపు పక్కన పెట్టి ఉపయోగకరమైన మరో విద్యలో పిల్లలు పాల్గొంటే శారీరకమైన ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది.