Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు అంటేనే తెలంగాణ బిజెపికి వణుకు

తెలంగాణలో చంద్రబాబు నాయుడితో పొత్తుకు బిజెపి స్థానిక నాయకత్వం ససేమిరా అంటోంది. 

తెలంగాణలో చంద్రబాబు నాయుడితో పొత్తుకు బిజెపి స్థానిక నాయకత్వం ససేమిరా అంటోంది. తెలంగాణలో టిడిపితో పొత్తు పెట్టుకుంటే మొదటికే మోసం రావచ్చుననేది బిజెపి తెలంగాణ నాయకుల భయం. చంద్రబాబు నాయుడు అమిత్ షాతో సమావేశమైన తర్వాత తెలంగాణలో టిడిపితో ఉండవచ్చుననే ప్రచారం జరుగుతోంది. దీనిపై బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అవి ఊహాగానాలు మాత్రమేనని కొట్టి పారేశారు. టిడిపితో తెలంగాణలో ఉండదని సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి స్పష్టంగా చెప్పారు. బిజెపి తెలంగాణ నాయకత్వం టిడిపికి వ్యతిరేకంగా స్పందించడానికి కారణమేమిటో చూద్దాం.