Asianet News TeluguAsianet News Telugu

అయోధ్య రామ మందిర నిర్మాణం : పురాణాలు-వాస్తవికతల నడుమ ప్రయాణం

అయోధ్య నగరాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. అయోధ్యను రాముడి జన్మస్థలంగా చాలా  మంది నమ్ముతారు. 

అయోధ్య నగరాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తారనే సంగతి తెలిసిందే. అయోధ్యను రాముడి జన్మస్థలంగా చాలా  మంది నమ్ముతారు. త్రేతాయుగంలో సరయూ నదీ తీరంలో రాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ నమ్మకాలకు చారిత్రక ఆధారాలు చాలా తక్కువ. అయితే అయోధ్యలో వివాదస్పద స్థలానికి సంబంధించిన రాజకీయ, సామాజిక, మత, న్యాయపరమైన వివాదాలు వందేళ్లకు పైగా భారతదేశాన్ని కుదిపేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అయోధ్య కొంత కీర్తిని  కోల్పోయింది. అయితే 2019 నవంబర్ 9వ తేదీన సుప్రీం కోర్టు రామ మందిరం నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. అయోధ్య చరిత్రలో సరికొత్త అధ్యాయనం మొదలైంది. వివాదస్థలం రామ్ లల్లాకు చెందుతుందని సుప్రీం కోర్టు ల్యాండ్ మార్క్ తీర్పు వెలువరించింది. దీంతో అక్కడ రామమందిర నిర్మాణ  పనులు సాగుతున్నాయి.