
PM Modi Inaugurates Safran Aircraft Engine Services India
భారత విమానయాన రంగానికి మరో కీలక మైలురాయిగా నిలిచే సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా సౌకర్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశీయ తయారీ, మెయింటెనెన్స్ రంగంలో భారత్ సాధిస్తున్న ప్రగతిని వివరించారు. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాల దిశగా ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుందని ప్రధాని తెలిపారు. భారతదేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.