ఎలిఫెంట్ విస్పరన్ కు ఆస్కార్ ... బొమ్మన్, బెల్లి దంపతులకు సీఎం స్టాలిన్ ఆర్థికసాయం
చెన్నై : 'ఎలిఫెంట్ విస్పరన్' డాక్యుమెంటరీ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును పొందడంతో ఎక్కడో మారుమూల అడవుల్లో వుండే గిరిజన దంపతులు బొమ్మన్, బెల్లి సెలబ్రిటీలుగా మారిపోయారు. మని సీఎం స్టాలిన్ ప్రకటించారు.
చెన్నై : 'ఎలిఫెంట్ విస్పరన్' డాక్యుమెంటరీ ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును పొందడంతో ఎక్కడో మారుమూల అడవుల్లో వుండే గిరిజన దంపతులు బొమ్మన్, బెల్లి సెలబ్రిటీలుగా మారిపోయారు. తప్పిపోయిన ఏనుగుకు ఎంతో ప్రేమగా కుటుంబసభ్యుడిగా చూసుకుంటున్న దంపతులపై కార్తికి గోన్‌సాల్వెస్ డాక్యుమెంటరీ రూపొందించారు. అందులో ఆ దంపతులు, ఏనుగు మధ్య అనుబంధాన్ని అద్భుతంగా చూపించారు. దీంతో బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ఈ ఎలిఫెంట్ విస్పరన్ ఆస్కార్ దక్కించుకుంది. ఆస్కార్ విన్నింగ్ డాక్యుమెంటరీతో బొమ్మన్, బెల్లి అనాధ ఏనుగులను పోషిస్తున్న విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ దంపతులను చెన్నైలోని సచివాలయంలో కలుసుకున్నారు. మూగ జీవాలకు సేవచేస్తున్న వీరిని ప్రత్యేకంగా అభినందించిన ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందించారు. అంతేకాకుండా నీలగిరి జిల్లా ముదుమలైలో ఏనుగుల సంరక్షణ కోసం పనిచేస్తున్న 91 మంది ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి తమిళనాడు ప్రభుత్వం తరపున రూ.9.10 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే అనైమలై ఏనుగు శిబిరాన్ని రూ.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని సీఎం స్టాలిన్ ప్రకటించారు.