Asianet News TeluguAsianet News Telugu

భారత్ తిరిగివచ్చిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ రన్నర్ అప్ ప్రజ్ఞానంద... చెన్నై ఎయిర్ పోర్టులో గ్రాండ్ వెల్కమ్..

చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత యువ చెస్ సంచలనం, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద స్వదేశానికి చేరుకున్నారు. 

చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత యువ చెస్ సంచలనం, గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద స్వదేశానికి చేరుకున్నారు. బుధవారం చెన్నైలోని విమానాశ్రయానికి చేరుకున్న ప్రజ్ఞానంద‌కు ఘన స్వాగతం లభించింది. వందలాది మంది అభిమానులు ఎయిర్ పోర్టు చేసుకుని అభినందలు తెలుపూ.. ఘన స్వాగతం పలికారు.  చెస్ ప్రపంచ కప్ ఫైనల్‌లో ప్రజ్ఞానందపై దిగ్గజ ఆటగాడు మగ్నస్ కార్ల‌సన్ (నార్వే) విజయం సాధించారు. ఈ తుదిపోరులో భారత యువ కిరాటం ఓడినా.. అతని ప్రతిభకు, అతని ఆట తీరుకు యావత్ ప్రపంచమే ఫిదా అయ్యింది. అటూ నెట్టింట్లో కూడా ఎందరో ప్రముఖులు, నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అభినందనలతో ప్రజ్ఞానందను ముంచెత్తుతున్నారు.