Asianet News TeluguAsianet News Telugu

`ఫేమస్‌` కావాలంటే కొత్తగా ట్రై చేయాలి..

తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమాలు ఈ మధ్య బాగా వర్కౌట్‌ అవుతున్నాయి. 

తెలంగాణ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమాలు ఈ మధ్య బాగా వర్కౌట్‌ అవుతున్నాయి. అలాగే `జాతిరత్నం` సినిమా స్టయిల్‌ కామెడీ కూడా ఆకట్టుకుంటుంది. అయితే అన్నీ సినిమాలకు అది సెట్ కాదు. బలమైన కంటెంట్‌ ఉన్నప్పుడు, దాన్ని అంతే బాగా తెరపైకి ఎక్కించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేదంటే తేడా కొడుతుంది. తాజాగా కొత్త కుర్రాళ్లు కలిసి చేసిన సినిమా `మేమ్‌ ఫేమస్‌`. సుమంత్‌ ప్రభాస్‌ అనే కుర్రాడు తనే దర్శకుడిగా, హీరోగా ఈ సినిమాని రూపొందించారు. దీన్ని `రైటర్‌ పద్మభూషణ్‌` వంటి సినిమాని తీసిన ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిల్మ్స్ వాళ్లు నిర్మించారు. నేడు శుక్రవారం(మే 26)న ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమాకి చాలా రోజులుగా వెరైటీ పబ్లిసిటీతో రచ్చ రచ్చ చేశారు. అందరి నోళ్లల్లో నానేలా చేశారు. మరి పబ్లిసిటీ చేసినంత స్టఫ్‌ సినిమాలో ఉందా? `రైటర్‌ పద్మభూషణ్‌`కి వర్కౌట్‌ అయినట్టు, ఈ సినిమాకి వర్కౌట్‌ అవుతుందా? ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

Video Top Stories