చెక్ మూవీ రివ్యూ: రొటీన్ కథలకి ‘చెక్’ పెట్టే ప్రయత్నంలో, కమర్షియల్ ఎలిమెంట్స్ కు ‘చెక్'?
కొత్త తరహా కథలుకు తెలుగులో రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోందని రీసెంట్ గా వచ్చిన ఉప్పెన, నాంది ప్రూవ్ చేసాయి.
కొత్త తరహా కథలుకు తెలుగులో రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోందని రీసెంట్ గా వచ్చిన ఉప్పెన, నాంది ప్రూవ్ చేసాయి. దాంతో వైవిధ్యమైన చిత్రాలకు కేరాఫ్ ఎడ్రస్ గా నిలుస్తూ వస్తున్న యేలేటి చంద్ర శేఖర్ కొత్త సినిమా అంటే ఖచ్చితంగా ఆసక్తి ఉంటుంది. అందులోనూ కమర్షియల్ సినిమాలు చేసే నితన్ తొలిసారిగా యేలేటి దర్శకత్వంలో చేయటం మరో ఇంట్రస్టింగ్ ఎలిమెంట్. అన్నిటికన్నా ముఖ్యంగా టెర్రరిస్ట్ గా ముద్రపడి జైల్లో ఉన్న ఖైధీకు,చెస్ కు ముడి పెడుతూ కథ చెప్పారనే విషయం వీటిన్నటికన్నా థియోటర్స్ కు సినీ ప్రేమికులను రప్పించే యుఎస్ పి. అయితే అంత ఉత్సాహంగా సినిమాకు వెళ్లిన జనాలకు ఈ సినిమా నచ్చిందా, కథేంటి, యేలేటి ఈ సారి తన మ్యాజిక్ ని రిపీట్ చేసారా, ఎవరు ఎవరికి చెక్ చెప్తారు వంటి విషయాలు చూద్దాం.