జర్నలిజంలోకి రావాలని అనుకోలేదు, కానీ ఆర్టీసిలో ఇలా జరిగింది: కెఆర్ మూర్తి
కెఆర్ మూర్తిగా ప్రసిద్ధులైన కె. రామచంద్రమూర్తి జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు.
కెఆర్ మూర్తిగా ప్రసిద్ధులైన కె. రామచంద్రమూర్తి జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. ఉదయం, ఆంధ్రజ్యోతి వంటి వివిధ పత్రికలకు ఆయన సంపాదకుడిగా పనిచేశారు. ఖమ్మం జిల్లాలో జన్మించిన మూర్తి జీవన ప్రయాణం ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ వచ్చింది. తెలుగు జర్నలిజంలో ఆయన వివిధ కొత్త శీర్షికలను ప్రవేశపెట్టారు. వార్తావ్యాఖ్య వంటి ప్రసిద్ధమైన కాలమ్స్ కూడా రాశారు. ఆయన తొలుత ఆర్టీసిలో పనిచేసి ఆ తర్వాత జర్నలిజంలోకి ప్రవేశించారు. ఆయన ఆర్టీసీలోనే ఉండిపోతే తెలుగు జర్నలిజం అత్యంత విలువైన రచయితను, మేధావిని కోల్పోయి ఉండేది. ఆయన జర్నలిజంలోకి రావాలని అనుకోలేదు. కానీ విచిత్రంగా ఆయన ఇందులోకి వచ్చారు. ఆయన మాటల్లోనే ఆయన జర్నలిజంలో వేసిన తొలి అడుగుల గురించి వినండి...