Asianet News TeluguAsianet News Telugu

అద్భుతమైన రచన ‘ఊరు గాని ఊరు’..: మంత్రి నిరంజన్ రెడ్డి

హైదరాబాద్ :  ప్రముఖ రచయిత కోట్ల వనజాత రచించిన అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు అవార్డు పొందిన ‘ఊరుగాని ఊరు’ నవలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ఆవిష్కరించారు. 

First Published Feb 7, 2023, 4:30 PM IST | Last Updated Feb 7, 2023, 4:30 PM IST

హైదరాబాద్ :  ప్రముఖ రచయిత కోట్ల వనజాత రచించిన అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్టు అవార్డు పొందిన ‘ఊరుగాని ఊరు’ నవలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి  ఆవిష్కరించారు. ఈ నవలను తనకు అంకితమిచ్చినందుకు రచయిత వనజాతకు ధన్యవాదాలు తెలిపారు నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ లో మంత్రుల నివాస సముదాయంలో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్, వలా రచయిత కోట్ల వనజాతతో పాటు ఇతర రచయితలు సీతారాం, కె.పి.అశోక్ కుమార్, నాగవరం బలరాం, భీంపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.