Asianet News TeluguAsianet News Telugu

2019 టాప్ 5 ఫ్యాషన్ ట్రెండ్స్ (వీడియో)

నేటి యువతకు నచ్చిందే ఫ్యాషన్. వారి మనుసును దోచిదంటే చాలు ఫ్యాషన్ ప్రపంచంలో మరో వస్తువు ట్రెండ్ అవుతున్నట్లే. ఇలాంటివి  ప్రస్తుతం ప్రపంచ  మార్కెట్ ను ఏలుతున్నాయి. కొన్ని బ్రాండ్స్ అయితే దశాబ్దాలు గడుస్తున్నా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక ప్రస్తుత సోషల్ మీడియా, సెల్ఫీల పుణ్యాన ఈ ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతోంది. అలా ఈ ఏడాది(2019) ఫ్యాషన్ మార్కెట్లో హవా కొనసాగిస్తున్న టాప్ 5 ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి తెలుసుకుందాం.

First Published Sep 20, 2019, 8:00 PM IST | Last Updated Sep 20, 2019, 8:00 PM IST

నేటి యువతకు నచ్చిందే ఫ్యాషన్. వారి మనుసును దోచిదంటే చాలు ఫ్యాషన్ ప్రపంచంలో మరో వస్తువు ట్రెండ్ అవుతున్నట్లే. ఇలాంటివి  ప్రస్తుతం ప్రపంచ  మార్కెట్ ను ఏలుతున్నాయి. కొన్ని బ్రాండ్స్ అయితే దశాబ్దాలు గడుస్తున్నా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తున్నాయి. ఇక ప్రస్తుత సోషల్ మీడియా, సెల్ఫీల పుణ్యాన ఈ ఫ్యాషన్ కొత్తపుంతలు తొక్కుతోంది. అలా ఈ ఏడాది(2019) ఫ్యాషన్ మార్కెట్లో హవా కొనసాగిస్తున్న టాప్ 5 ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి తెలుసుకుందాం. 

బ్యాగీ డెనిమ్: ప్రతి సీజన్‌లో డెనిమ్ ధోరణి మారుతూవుంటుంది కానీ బ్యాగీ డెనిమ్ తిరిగి ఫ్యాషన్‌లోకి వస్తుంది. ఇది అందించే సౌకర్యం మరియు సహజత్వం కలగలిసి  అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటోంది. బ్లేజర్ బ్రిగేడ్ నుండి టీనేజర్స్ మరియు హై-ఎండ్ ఫ్యాషన్ స్టైలిస్టుల వరకు విభిన్న రకాల వ్యక్తులను కూడా ఈ డెనిమ్ ఫ్యాషన్ ఒక్కచోటికి చేరుస్తోంది. 

క్వాల్టింగ్:  ప్రతి ఒక్కరూ పడుకునే సమయంలో బెడ్  పైన వెచ్చటి దుప్పటిని ఉండటాన్ని బాగా ఇష్టపడతారు. ఇదే ఫార్ములాను ఫ్యాషన్ కు అన్వయించి యువతను ఆకట్టునుకునే ప్రయత్నం మార్కెట్ వర్గాలు చేస్తున్నాయి. ఇలా మనకు చల్లటి  వాతావరణంలో వెచ్చదనాన్నిచ్చే దుస్తుల, ప్రాడక్ట్స్ నేటి ఫ్యాషన్  కు అనుగుణంగా రూపొందించి కొన్ని సంస్థలు మార్కెట్ ను దున్నేస్తున్నాయి. అలా యువత తాము ధరించే జాకెట్ల నుండి బూట్లు మరియు బ్యాగులు వంటివి సెలెక్ట్ చేసుకునేటపుడు ఇలాంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరీముఖ్యంగా క్వాల్టెడ్  లేదర్ జాకెట్లు, దుస్తులు నేటి ఫ్యాషన్ లో భాగమైపోయాయి. 
  
యుటిలిటేరియన్ బూట్లు: గ్రంజ్-ప్రేరేపిత రూపాలు డిజైనర్లను బాగా ప్రేరేపితం చేసినట్లున్నాయి.  ఆ స్టైల్లో ప్రత్యేకంగా రూపొందించిన షూస్ నేటి తరానికి అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఆ స్టైల్ షూస్ ఫ్యాషన్ ట్రెండింగ్ మారిపోయాయి. పంక్-రాక్ శైలిలోని లేస్, ఫ్రిల్స్ మరియు రఫ్ఫుల్స్ ను కలిగిన  అతిపెద్ద  యుటిటేరియన్ షూస్ ఫ్యాషన్ ప్రపంచంలో దూసుకుపోతున్నాయి. 
 

ప్రైరీ దుస్తులు: ఒకానొక సమయంలో యువతను ఉర్రూతలూగించిన ప్రైరీ స్టైల్ దుస్తులు మరోసారి ట్రెడింగ్ గా మారాయి. ఈ తరహా దుస్తులు ఈ మధ్యకాలంలో అధికంగా సేల్ అవుతున్నాయట. మెడ నుండి కాళ్ల వరకు శరీరాన్ని పూర్తిగా  కప్పివుంచే ఈ డ్రెస్సింగ్ స్టైల్ పై యువత  మనసు పారేసుకుంటున్నారట. ఈ ప్రైరీ దుస్తులను యుటిటేరియన్ బూట్లతో లేదా స్టైలిష్ జత పంప్స్, సైడిల్స్ ను జత చేస్తే అదిరిపోతుంది. 


బాయిలర్ సూట్లు: 30 ఏళ్ళక్రితంనాటి ఫ్యాషన్ ఈ బాయిలర్ సూట్లు. మిలిటరీ ఫ్లైట్ సూట్‌ల ఆధారంగా  రూపొందిన ఈ బాయిలర్ సూట్ ఫ్యాషన్ ప్రపంచాన్ని రాక్ చేయడానికే పుట్టిన ఓ అద్భుతం. శరీరం మొత్తాన్ని కప్పివుంచే ఇది ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. దీనికి స్నీకర్స్, గ్లాడియేటర్ సాండిల్స్ జతచేస్తే  ఫ్యాషన్ కు మరింత కొత్త సొబగులు అద్దనున్నాయి.