కౌగిలింతా ఓ వింతైన ఉద్యోగమే (వీడియో)

రొడ్డకొట్టుడు రొటీన్ ఉద్యోగాల్లో బోర్ గా ఫీలవుతూ, తప్పనిసరై తమను తాము ఈడ్చుకుంటూ పనిచేసేవాళ్లే మనలో చాలామంది. నూటికి తొంభైశాతం ఇలాంటివారే ఉంటారు. కానీ అందరికంటే భిన్నంగా ఉండేవాళ్లు కొంతమంది ఉంటారు. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోయేలాంటి ఉద్యోగాలు చేస్తూ సంతోషంతోపాటు, సంపాదననూ పొందుతున్నారు. అలాంటి ఐదురకాల అసాధారణ ఉద్యోగాల గురించి చూద్దాం.

First Published Oct 5, 2019, 11:26 AM IST | Last Updated Oct 5, 2019, 11:26 AM IST

రొడ్డకొట్టుడు రొటీన్ ఉద్యోగాల్లో బోర్ గా ఫీలవుతూ, తప్పనిసరై తమను తాము ఈడ్చుకుంటూ పనిచేసేవాళ్లే మనలో చాలామంది. నూటికి తొంభైశాతం ఇలాంటివారే ఉంటారు. కానీ అందరికంటే భిన్నంగా ఉండేవాళ్లు కొంతమంది ఉంటారు. ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయా అని ఆశ్చర్యపోయేలాంటి ఉద్యోగాలు చేస్తూ సంతోషంతోపాటు, సంపాదననూ పొందుతున్నారు. అలాంటి ఐదురకాల అసాధారణ ఉద్యోగాల గురించి చూద్దాం.

1. కౌగిలింతా ఉద్యోగమే : వినడానికి కాస్త వింతగా ఉన్నా ఇది నిజం. కౌగిలించుకోవడం, హత్తుకోవడం, చుట్టేసుకోవడమూ ఉద్యోగమే. అలిసిన శరీరానికి, మనసుకు ఓ చక్కటి కౌగిలింత కలిగించే ఉపశమనం మాటల్లో చెప్పలేనిది. దీనికోసం వీరు గంటకు నాలుగునుండి ఐదున్నరవేలు ఛార్జ్ చేస్తారు.

2. పెళ్లిల్లో అతిథులు : నేటి పెళ్లికి హాజరుకావడం అంటే కాస్త ఓపికను పరీక్షించే వ్యవహారమే. మరీ దగ్గరివాళ్లైతే తప్ప అంతగా ఆసక్తి చూపరు. దీంతో శుభకార్యం చేసేవాళ్లు అతిథుల సంఖ్యతో ఇబ్బందిపడతారు. వీరి కోసం పుట్టిన కొత్త ఉద్యోగమే పెళ్లిలో అతిథి. చక్కగా రెడీ అయ్యి పెళ్లికి హాజరుకావడం వీరి ఉద్యోగం. చక్కటి విందుభోజనంతో పాటు, జీతమూ తీసుకునే సౌకర్యవంతమైన ఉద్యోగం ఇది.

3. పెంపుడు జంతువుల ఆహారపరిశీలకుడు : మనిషి నేస్తాలు పెంపుడు జంతువులు. వాటికి రుచికరమైన పోషకాహారాన్ని ఆహారాన్ని అందించడం మన కనీస బాధ్యత. మీరందిస్తున్న ఆహారం ఎలాఉంటుందో తెలుసుకోవాలంటే పెంపుడు జంతువుల ఆహారపరిశీలకుడిని పిలవండి. మీరు పెడుతున్న ఆహారం నాణ్యతా ప్రమాణాల్లోనే ఉందాలేదా వీరు రుచి చూసి నిర్ణయిస్తారు. మీ కుటుంబపు స్నేహితుడి ఆరోగ్యం కోసం ఈ మాత్రం జాగ్రత్త తప్పనిసరి కదా.

4. మంచాల పరిశీలకుడు : వినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా ఇలాంటి ఉద్యోగమూ ఉంది. కంపెనీలు, హోటళ్లలోని మంచాలు, పరుపులు పడుకోవడానికి అనువుగా ఉన్నాయా లేదా అని పరిశీలించడమే వీరిపని. పరుపుల్లో ఎత్తుపళ్లాలు లేకుండా, మంచాల చివర్లు కూచోడానికి వీలైనంత దృఢంగా ఉన్నాయా లేదా అని చెక్ చేస్తారు. 

5. వాటర్ స్లైడ్ టెస్టర్ : వాటర్ స్లైడ్ టెస్టర్ పనేంటంటే వాటర్ స్లైడ్ లో ఎంత నీరుండాలి...ఎంత నీరుంటే ఆ జారుడుబండలో జారడం ఎంత సౌకర్యవంతంగా, సరదాగా ఉంటుంది, ఎంత తొందరగా పైనుండి కిందికి చేరుకుంటాం అని చూడడం. దీనికోసం అనేకసార్లు ఈ జారుడుబండమీద ప్రయాణించి చూడాల్సి ఉంటుంది. సరదాగా కనిపించే ఇబ్బందికరమైన ఉద్యోగం కదా.