Asianet News TeluguAsianet News Telugu

గర్భిణులకే కాదు అందరికీ... (వీడియో)

ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన మసాలాదినుసు కుంకుమపువ్వు. కుంకుమపువ్వు పండించడానికి మానవశ్రమ అధికంగా అవసరం అవుతుంది. అందువల్లే కుంకుమపువ్వు ఉత్పత్తి విలువ ఎక్కువవుతుంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీధైన మసాలాదినుసు కుంకుమపువ్వు. కుంకుమపువ్వు పండించడానికి మానవశ్రమ అధికంగా అవసరం అవుతుంది. అందువల్లే కుంకుమపువ్వు ఉత్పత్తి విలువ ఎక్కువవుతుంది.

కుంకుమపువ్వుతో కలిగే ఐదు ఆరోగ్యప్రయోజనాలు ఇవి 

అత్యథిక యాంటీ ఆక్సిడెంట్లు : కుంకుమపువ్వులో అధికమొత్తంలో ఉండే విభిన్నరకాల రసాయనసమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణలో ఏర్పడే ఒత్తిడినుండి శరీరంలోని కణాలకు ఉపశమనం కలిగిస్తుంది. మెదడు కణజాలం దెబ్బతినకుండా రక్షిస్తుంది. ఆకలిని పెంచుతుంది, బరువుతగ్గడానికి సహాయం చేస్తుంది. 

క్యాన్సర్ తో పోరాడే లక్షణాలు : కుంకుమపువ్వులో ఉన్న యాంటీఆక్సిడెంట్లు హానికారక ఫ్రీ రాడికల్స్ ను తటస్థపర్చడంతో తోడ్పడతాయి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ వల్ల క్యాన్సర్ లాంటి దీర్ఝకాలికవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చర్మం, బోన్ మారో, ప్రొస్టేట్, లంగ్, సెర్విక్స్ లాంటి అనేక రకాల క్యాన్సర్ కారక కణాలవృద్ధికి తోడ్పడుతుంది. 

PMS లక్షణాలను తగ్గిస్తుంది : నెలసరి ముందు ఏర్పడే శారీరక, మానసిక, భావోద్వేగ ఒడిదుడుకుల్నే PMS అంటారు. కుంకుమపువ్వు ఆహారంలో తీసుకోవడం, కుంకుమపువ్వు వాసన చూడడం రెండూ PMS లక్షణాలను తగ్గిస్తాయి. వీటితో పాటు చిరాకు, విసుగు, తలనొప్పి, నొప్పి, ఆందోళన, కోరికల్లాంటి లక్షణాలను తగ్గిస్తుంది.

గుండెసంబంధింత వ్యాధి కారకాలను తగ్గించొచ్చు : కుంకుమపువ్వులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించడం వల్ల, ధమనులు, సిరల్లో రక్తం గడ్డకట్టకుండా అడ్డుకుంటాయి. టెస్టు ట్యూబ్ పరిశోధనలు, జంతువుల మీద చేసిన పరిశోధనల్లో ఈ విషయం తేలింది.

అల్జీమర్స్ తో బాధపడే పెద్దవాళ్లలో జ్ఞాపకశక్తిని పెంచుతుంది : వయసుపైబడిన వారిలో కనిపించే అల్జీమర్స్..తద్వారా ఏర్పడే మతిమరుపును పోగొట్టి జ్ఞాపకశక్తిని పెంపొందించడంలో కుంకుమపువ్వులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు బాగా పనిచేస్తాయి.