Asianet News TeluguAsianet News Telugu

జెలెన్‌స్కీ క్షేమంగా ఉన్నారు...ఉక్రెయిన్ పౌరులకు ఆయన ఆత్మ స్థైర్యం నింపుతున్నారు...

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల సర్వం కోల్పోయిన ఉక్రెయిన్ వాసుల వెతలు చూస్తుంటే కళ్ళు చెమర్చక మానవు. 

ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం వల్ల సర్వం కోల్పోయిన ఉక్రెయిన్ వాసుల వెతలు చూస్తుంటే కళ్ళు చెమర్చక మానవు. రష్యా భీకర దాడులు  చేస్తూ భారీగా ప్రాణ, ఆస్తినష్టానికి తెరలేపింది. ఈ యుద్ధం వల్ల అన్నీ పోగొట్టుకున్న సామాన్య ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు  స్వస్థలాలకు వదలి, ఏ క్షణాన ఏ క్షిపణి వచ్చి మీదపడుతుందో, లేదా ఎదో ఒక బాంబు మీదపడి  ప్రాణాలు పోతాయో తెలియక ప్రాణాలు కాపాడుకోవడానికి గడ్డకట్టించే చలిలో కిలోమీటర్ల దూరాలు నడిచి ఆకలితో అలమటిస్తూ  సరిహద్దు దేశాలకు పారిపోయేందుకు వారు చేస్తున్న జీవన్మరణ పోరాటం చూస్తే ఎవరి మనసు నైనా కలిచివేస్తుంది.. ఇప్పటివరకు రెండున్నర మిలియన్ల ప్రజలు సరిహద్దులు దాటి పోలాండ్ వంటి దేశాలకు శరణార్థులుగా వెళ్లిపోయారు...ఉక్రెయిన్ అధ్యక్షుడు  జెలెన్‌స్కీ  రష్యా దురాక్రమణ ను ఎదుర్కోవడం లో మొక్కవోని ధైర్యం తో వ్యవహరిస్తున్నారు. ఆయన పుట్టిన ప్రాంతం కూడా రష్యా దురాక్రమణకు తీవ్రం గా దెబ్బతింది. అక్కడ స్థానికులు కూడా పోలాండ్ సరిహద్దుల్లో తలదాచుకుంటున్నారు. వారితో యుద్ధ వార్తలు అందించడానికి అక్కడ ప్రాణాలకు తెగించి నిరంతరం కృషి చేస్తున్న మా ఏసియా నెట్ న్యూస్ ప్రతినిధి ప్రశాంత్ రఘువంశం మాట్లాడటం జరిగింది..ఆ వీడియో ఎక్స్ క్లూసివ్ గా మీకోసం...