Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోడీ చాలా అవకాశాలను సృష్టించే తరుణంలో ఉన్నారు.. రే డాలియో

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీని పలు రంగాలకు  చెందిన ప్రముఖులు కలుస్తున్నారు. 

First Published Jun 21, 2023, 10:44 AM IST | Last Updated Jun 21, 2023, 10:44 AM IST

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీని పలు రంగాలకు  చెందిన ప్రముఖులు కలుస్తున్నారు. న్యూయార్క్‌లో ప్రధాని మోదీ.. పలువురు ప్రముఖలతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రధాని మోదీతో ప్రముఖ పెట్టుబడిదారుడు, విశ్లేషకుడు రే డాలియో భేటీ అయ్యారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం రే డాలియో మాట్లాడుతూ.. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి వ్యక్తి అంటే.. వారి సమయం వచ్చింది అంటే భారతదేశం సమయం వచ్చిందని అర్థం చేసుకోండి. భారతదేశ సామర్థ్యం చాలా పెద్దది. భారత్‌లో ఇప్పుడు మార్పు తీసుకురాగల సామర్థ్యం ఉన్న సంస్కర్త ఉన్నారు. ప్రస్తుతం భారతదేశం, ప్రధాని మోడీ చాలా అవకాశాలను సృష్టించే తరుణంలో ఉన్నారు’’ అని పేర్కొన్నారు.