సేఫ్ గా ఆవకాయ.. ఫిదా అత్తగారూ ఎలా పెట్టారో చూడండి...

మామిడికాయ పచ్చడి సీజన్ అంటే ఒకప్పుడు పెద్ద పని. కాయలు తేవడం కంటే ముందు ఆవాలు, అల్లంవెల్లుల్లి, కారం, జీలకరమెంతులపొడి, నూనె ఇవన్నీ ముందు రెడీగా పెట్టుకుని ఆ తరువాత కాయలు తెచ్చి కొట్టించేవారు. 

First Published May 17, 2023, 9:59 PM IST | Last Updated May 17, 2023, 9:59 PM IST

మామిడికాయ పచ్చడి సీజన్ అంటే ఒకప్పుడు పెద్ద పని. కాయలు తేవడం కంటే ముందు ఆవాలు, అల్లంవెల్లుల్లి, కారం, జీలకరమెంతులపొడి, నూనె ఇవన్నీ ముందు రెడీగా పెట్టుకుని ఆ తరువాత కాయలు తెచ్చి కొట్టించేవారు. ఓ నాలుగైదు రోజుల పని. ఇప్పటికీ ఇంతపనే ఉంటుంది కానీ అన్నీ రెడీమేడ్ దొరుకుతాయి. తెచ్చి కలిపేయడమే. హైజిన్ లాంటి విషయాల్లో కాస్త అజాగ్రత్తగానే ఉంటున్నాం. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టడానికే ఆర్గానిక్ గంప అనే ఓ సంస్థ రెడీమేడ్ ఆవకాయ కిట్లను రూపొందించింది. అవసరానికి తగ్గట్టుగా మామిడికాయ ముక్కలను కొట్టి, వాటికి అవసరమైన మసాలాలన్నీ కలిపి అందిస్తుంది. దీంతో అరగంటలో ఆవకాయ పెట్టేసుకోవచ్చు. చూడండి.