chhava Movie: కోలుకొన్న రష్మిక.. చావా ప్రమోషన్స్ లో ఫుల్ జోష్

Share this Video

పుష్ప, యానిమల్ వరుస విజయాలతో దూసుకెళ్తున్న రష్మిక మందన్నా మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకొనేందుకు సిద్ధమయ్యారు. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించిన హిస్టారికల్ డ్రామా ‘చావా’లో రష్మిక నటించారు. మరాఠీలు దేవుడిగా కొలిచే చతప్రతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా చావా మూవీ నిర్మించారు. లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వం వహించగా.. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మూవీ ప్రమోసన్స్‌ చేపట్టింది చిత్ర బృందం. తాజాగా ముంబైలోని దాదర్‌లో ఛిత్రా సినిమాస్‌ను సందర్శించి అభిమానులతో సరదాగా మాట్లాడారు విక్కీ కౌశల్‌, రష్మిక మందన్నా.

Related Video