Asianet News TeluguAsianet News Telugu

పుష్ప రిలీజ్ డేట్ వెనుకున్న స్కెచ్ ఇదే..ఐకాన్ స్టార్ దెబ్బకి పాత రికార్డులన్నీ మాయం కావాల్సిందే...

అల్లు అర్జున్(Allu arjun) హీరోగా వస్తున్న పుష్ప2(Pushpa2)రిలీజ్ డేట్ ప్రకటించటమే సినీ ప్రియుల్లో హాట్ టాపిక్. 

అల్లు అర్జున్(Allu arjun) హీరోగా వస్తున్న పుష్ప2(Pushpa2)రిలీజ్ డేట్ ప్రకటించటమే సినీ ప్రియుల్లో హాట్ టాపిక్. పుష్ప సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ  పాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీగా ఉండటంతో అందుకు తగ్గట్లుగానే తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ సినిమా రిలీజ్ కోసం అటు నార్త్ ఆడియన్స్, ఇటు సౌత్ ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారనే విషయం గమనించి రిలీజ్ డేట్ ని ప్లాన్ చేసి ప్రకటించారు.  ఈ సినిమాను 2024 స్వతంత్ర దినోత్సవ సందర్బంగా ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ డేట్ చూసి చాలా మంది షాక్ అ్యయారు. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయ్యిన ఈ సినిమా ఇంత లేటు రిలీజ్ ఏంటనేది ఒకటి అయితే అసలు ఆ డేట్ ఎంపిక కు ప్రత్యేకమైన రీజన్ ఉందా అని ఆరాతీస్తున్నారు.