ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి పబ్లిక్ టాక్ : పర్ఫెక్ట్ ఫ్యామిలీ సినిమా

వరుస పరాజయాల అనంతరం యంగ్‌ హీరో నాగశౌర్య గతేడాది `కృష్ణ వ్రిందా విహారి` చిత్రంతో డీసెంట్‌ హిట్‌ని అందుకున్నాడు. 

First Published Mar 17, 2023, 4:19 PM IST | Last Updated Mar 17, 2023, 4:19 PM IST

వరుస పరాజయాల అనంతరం యంగ్‌ హీరో నాగశౌర్య గతేడాది `కృష్ణ వ్రిందా విహారి` చిత్రంతో డీసెంట్‌ హిట్‌ని అందుకున్నాడు. అంతేకాదు ఈ మధ్యనే పెళ్లి కూడా చేసుకున్నాడు. మ్యారేజ్‌ తర్వాత ఆయన్నుంచి వస్తోన్న మూవీ `ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి`(ఫఫ). `ఊహలు గుసగుసలాడే`, `జ్యో అచ్యుతానంద` వంటి హిట్ల తర్వాత నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్‌ అవసరాల కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రమిది. మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఐదేళ్ల క్రితమే ప్రారంభమైంది. కరోనా కారణంగా ఆలస్యమవుతుంది. అయితే కథ కూడా ఏడు ఛాప్టర్లలో సాగుతుందని చెప్పారు దర్శకుడు. కరోనా తమకి కలిసొచ్చిందన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నేడు శుక్రవారం(మార్చి 17న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉందో ఈ పబ్లిక్ టాక్ లో  తెలుసుకుందాం.