ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా నాగశౌర్య కొత్త సినిమా!

నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం 4గా కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మహేష్ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్న కొత్త చిత్రం శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.

First Published Feb 28, 2020, 5:06 PM IST | Last Updated Feb 28, 2020, 5:06 PM IST

యువ కథనాయకుడు నాగశౌర్య హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం 4గా కె.పి.రాజేంద్ర దర్శకత్వంలో మహేష్ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్న కొత్త చిత్రం శుక్రవారం ఉదయం రామానాయుడు స్టూడియోస్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఘ‌నంగా ప్రారంభమైంది. ముహూర్తపు స‌న్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా హీరో కల్యాణ్ రామ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకులు హరీష్ శంకర్, వి.ఐ.ఆనంద్ గౌరవ దర్శకత్వం వహించారు.