విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న దర్శకుడు ఆర్జివి, మాజీ మంత్రి కొండా సురేఖ
విజయవాడ: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖ, మురళి దంపతుల బయోపిక్ ''కొండా'' పేరుతో రూపొందిన విషయం తెలిసిందే.
విజయవాడ: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖ, మురళి దంపతుల బయోపిక్ ''కొండా'' పేరుతో రూపొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ చిత్రబృందం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. మాజీ మంత్రి కొండా సురేఖ, దర్శకుడు రాంగోపాల్ వర్మతో పాటు నిర్మాత కొండా సుష్మిత, నటులు అదిత్ అరుణ్, ఇర్ర మోర్ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు కొండా సినిమా బృందానికి వేదాశీర్వచనం చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆర్జీవీ మాట్లాడుతూ.... విజయవాడలోనే ఇంజనీరింగ్ చదివినా ఏనాడు దుర్గమ్మ దర్శించుకోలేదన్నారు. కానీ కొండా సురేఖ దంపతుల వల్ల ఈనాడు అమ్మవారిని దర్శించుకున్నానని అన్నారు. కొండా సినిమా హిట్ కావాలని అమ్మవారిని కోరుకున్నానని వర్మ తెలిపారు. కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆర్జీవీ దేవుడు పంపిన దూతగా వచ్చి తమ బయోపిక్ తీశారన్నారు. సినిమా విజయవంతం అయ్యాక అమ్మవారి దర్శనానికి మళ్లీ వస్తామని సురేఖ పేర్కొన్నారు.