బాలయ్య నిజంగానే లెజెండ్.. ఊర్వశి రౌతెలా స్పీచ్ | Daaku Maharaaj | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Jan 23, 2025, 4:59 PM IST

సంక్రాంతి బరిలో డాకు మహారాజ్ చిత్రంతో నిలిచి మాస్ ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాడు నటసింహం నందమూరి బాలక్రిష్ణ. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద్ధా శ్రీనాథ్.. బాలయ్యతో ప్రధాన పాత్రల్లో కనిపించారు. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ మాస్ మ్యూజిక్ అందించి.. థియేటర్లలో బాక్సులు బద్దలు చేశాడు. ఫుల్ & ఫైనల్‌గా మాస్ ఆడియెన్స్‌కి చేరువైన డాకు మహారాజ్ సక్సెస్‌తో సంబరాల్లో మునిగిపోయింది మూవీ టీం. అనంతపురంలో డాకు మహారాజ్ గ్రాండ్ సక్సెస్ మీట్ జరిగింది. బాలయ్యపై నటి ఊర్వశి రౌతెలా ప్రశంసలు కురిపించింది.

Read More...