Asianet News TeluguAsianet News Telugu

ఆటో రజిని : ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కొడాలి నాని

ఆటో రజిని సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను  ఏపీ మంత్రి కొడాలి నాని విడుదల చేశారు.

ఆటో రజిని సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను  ఏపీ మంత్రి కొడాలి నాని విడుదల చేశారు. శ్రీ మహాలక్ష్మి ఎంటర్ ప్రైజేస్ బ్యానర్ పై  జొన్నలగడ్డ శ్రీనివాస్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ఆటో రజని.  ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమాతో తన  డాన్స్ లతో, యాక్టింగ్ తో మంచి పేరు తెచ్చుకున్న జొన్నలగడ్డ హరికృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ "ఆటో రజని".  ఈ సందర్భంగా  దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందుకున్న మొదటి చిత్రంగా మా "ఆటో రజని" ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. ఈరోజు గౌరవ మంత్రి వర్యులు కొడాలి నాని గారు మా ఆటో రజినీ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. వారికి మా ధన్యవాదములు అన్నారు.