అర్జున్ S/O వైజయంతి Teaser Launch Event Highlights | Kalyan Ram | Vijayasanthi | Asianet News Telugu
కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి డైరక్షన్ లో నందమూరి కళ్యాణ్ రామ్, విజయ శాంతి కీలక పాత్రల్లో నటించిన సినిమా 'అర్జున్ S/O వైజయంతి'. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ శాంతి మరోసారి ఈ మూవీలో కనిపిస్తున్నారు. అటు, కళ్యాణ్ రామ్ విజయ శాంతి కొడుకుగా మాస్ పాత్రలో ఆడియన్స్ ని అలరించనున్నారు. కాగా, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పకుడిగా అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాంతార ఫేమ్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ కాగా, సోహా అలీ ఖాన్ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో టీజర్ విడుదల చేశారు. ఈ ఈవెంట్ హై లైట్స్ చూసేయండి.