నీ పేరు ఏంటి అసలు? రిపోర్టర్ ప్రశ్నకి జీవా షాక్ | Aghathiyaa movie Q&A pressmeet | Asianet Telugu
జీవా, అర్జున్ సర్జా, రాశీఖన్నా జంటగా నటించిన తమిళ చిత్రం అగత్యా. తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలైంది. ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్, మటిల్డా, రెడిన్ కింగ్స్లీ , షారా, రాధా రవి, రోహిణి, చార్లే, ఇంద్రజ శంకర్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పా. విజయ్ రచన, దర్శకత్వం వహించారు. ఇషారి కె. గణేష్ తన వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించారు. వామ్ ఇండియా పతాకంపై అనీష్ అర్జున్ దేవ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తెలుగులో అగత్యా సినిమా విడుదల సందర్భంగా హీరో జీవా మీడియాతో మాట్లాడారు.