Asianet News TeluguAsianet News Telugu

video:పేకాటలో లక్షల సంపాదన... మహిళా ఐఎఎస్ వద్ద యువకుడి వింత కోరిక

చిత్తూరు జిల్లా మదనపల్లెలో  జరిగిన స్పందన కార్యక్రమంలో ఓ యువకుడి వింత కోరికను మహిళా ఐఎఎస్ ముందుంచాడు. అందుకోసం అధికారికంగా ఆర్జీ కూడా పెట్టుకున్నాడు.  

చిత్తూరు జిల్లా కురబలకోట మండలానికి చెందిన కొమ్మద్ది బావాజీ(24) పేద కుటుంబంలో పుట్టాడు. అతడికి చదువు అబ్బకపోయినా తెలివైన కుర్రాడు. అయితే ఆ తెలివిని మంచి పనులకు ఉపయోగించకుండా అతడు జూదంలో ఉపయోగించాడు. 12వ ఏటనే పేకాటలో ప్రావిణ్యం సంపాదించిన అతడు ప్రస్తుతం అందులో మాస్టర్ గా మారాడు. ఎంతలా అంటే ప్లేయింగ్ కార్డ్స్(పేక ముక్కలు) చూడగానే ఆ కార్డు ఏమిటో ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇదే ప్రావీణ్యం జూదంలో ప్రదర్శిస్తూ లెక్కకు మించి డబ్బు సంపాదించానని అంటున్నాడు. 

అయితే మదనపల్లెలో సబ్ కలెక్టర్ ప్రత్యక్షంగా పాల్గొన్న ప్రతిస్పందన కార్యక్రమంలో అతడు ఓ వింతైన అర్జీ పెట్టుకున్నాడు. యువ ఐఎఎస్ అధికారిణి, మదనపల్లె సబ్ కలెక్టరు చెరుకూరి కీర్తి ముందే పేక ముక్కలతో తన ప్రావిణ్యాన్ని ప్రదర్శించి...చివరకు తన ఆలోచనను ఆమెకు తెలియజేశాడు.  తన వల్ల ఓడిపోయిన కుటుంబాలు నష్టపోకూడదనే ఉద్దేశంతో మారాలనుకుంటున్నానని.. ఏ పనీ చేయలేని తాను ఈ సమాజానికి ఏదైనా కొంచెం చేయాలని ఆశిస్తూ అవయవ దానం చేయాలనుకుంటున్నానని అధికారులకు తెలియజేసి అనుమతి కోరాడు.