userpic
user-icon

video news : అలరిస్తున్న మంగంపేట వాటర్ ఫాల్స్

Siva Kodati  | Published: Oct 29, 2019, 5:00 PM IST

కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలోని మంగంపేట వాటర్ ఫాల్స్ కి పర్యాటకులు పోటెత్తారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు  ఎర్రమల కొండల మధ్య నుంచి జాలువారుతున్న నీటి ప్రవాహం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. ఈ సుందర దృశ్యాలను చూసేందుకు కర్నూలు జిల్లాతో పాటు, చుట్టుపక్కల జిల్లాల ప్రజలు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

దీపావళి సెలవు దినాలు కావడంతో జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి ఈ వాటర్ ఫాల్స్ చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడంతో మంగంపేట గ్రామ సమీపంలో వాహనాల రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దాదాపు రెండు గంటల సేపు వాహనాలు అటూఇటూ కదలకుండా ఉండిపోయాయి పర్యాటకులు వాహనాలను మధ్యలోనే వదిలేసి కాలినడకన వాటర్ ఫాల్స్ ప్రాంతానికి చేరుకున్నారు.

Read More

Must See