Asianet News TeluguAsianet News Telugu

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా: షాడో బ్యాటింగ్ తో స్టీవ్ స్మిత్ కి ఝలక్ ఇచ్చిన హిట్ మ్యాన్

‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ క్రేజీ యాటిట్యూడ్‌తో భారత క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు.

First Published Jan 18, 2021, 3:41 PM IST | Last Updated Jan 18, 2021, 3:41 PM IST

‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ క్రేజీ యాటిట్యూడ్‌తో భారత క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. క్రికెట్ మైదానంలో క్రేజీ పనులు చేయడం విరాట్ కోహ్లీకి బాగా అలవాటు. కోహ్లీ గైర్హజరీతో వాటిని మిస్ అయిన వారికి, రోహిత్ తన చిలిపి, క్రేజీ యాటిట్యూడ్‌తో ఆ లోటు తీరుస్తున్నాడు. మూడో టెస్టులో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టీవ్ స్మిత్ షాడో బ్యాటింగ్ చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. స్మిత్, రిషబ్ పంత్ లేనప్పుడు షాడో బ్యాటింగ్ చేస్తే, నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అతను చూస్తుండగానే షాడో బ్యాటింగ్ చేశాడు రోహిత్ శర్మ.