ధోని లాంటి ఇంకెందరో మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ఈ పోటీలు : రాజమౌళి

భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి స్కూల్‌ క్రికెట్ బలోపేతానికి ముందుకొచ్చారు. 

Share this Video

భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి స్కూల్‌ క్రికెట్ బలోపేతానికి ముందుకొచ్చారు. స్కూల్‌ స్థాయి నుంచే అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసేందుకు ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌‌ ఫర్‌ క్రికెట్‌ (ఐఎస్‌బిసి) మూడంచెల పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరిలో భారత్‌ వేదికగా స్కూల్స్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ జరుగనుండగా.. ఇండియన్‌ స్కూల్స్‌ బోర్డ్‌ ఆఫ్‌ క్రికెట్‌ గౌరవ చైర్మెన్‌గా ‌ఎస్‌ రాజమౌళి ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం నగరంలోని ఓ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఐఎస్‌బిసి ఫౌండర్‌ సీఈవో సునీల్‌బాబు కొలనుపాక వెల్లడించారు. 

జనవరిలో స్కూల్స్‌ ప్రపంచకప్‌ :

2024 జనవరిలో స్కూల్స్‌ క్రికెట్‌ ప్రపంచకప్‌ నిర్వహించనున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఎనిమిది దేశాలు పోటీపడనున్నాయి. అంతకముందు, ప్రాజెక్ట్‌ స్కూల్‌ వరల్డ్‌కప్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 766 జిల్లాల్లో ఇంటర్‌ డిస్ర్టిక్‌, ఇంటర్‌ స్టేట్‌, ఇండియన్‌ స్కూల్‌ టాలెంట్‌ లీగ్‌ (ఐఎస్‌టీఎల్‌) నిర్వహిస్తారు. ఇండియన్‌ స్కూల్‌ టాలెంట్‌ లీగ్‌లో ఎనిమిది ప్రాంఛైజీలు ఆడతాయి. ఈ లీగ్‌లో విజేతగా నిలిచిన జట్టు స్కూల్‌ ప్రపంచకప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించనుంది.

Related Video