డెబ్యూ మ్యాచ్ లోనే సెంచరీ ఒక స్పెషల్ మూమెంట్, చాలా ఎంజాయ్ చేశాను : యశస్వి జైస్వాల్

వెస్టిండీస్‌తో జరుగుతున్న డొమినికా టెస్టులో టీమిండియా పూర్తి ఆధిక్యం కొనసాగిస్తోంది. 

First Published Jul 14, 2023, 9:58 AM IST | Last Updated Jul 14, 2023, 9:58 AM IST

వెస్టిండీస్‌తో జరుగుతున్న డొమినికా టెస్టులో టీమిండియా పూర్తి ఆధిక్యం కొనసాగిస్తోంది. తొలి రోజు రెండున్నర సెషన్లలోనే విండీస్‌ని ఆలౌట్ చేశారు భారత బౌలర్లు. రెండో రోజు భారత బ్యాటర్ల హవా నడించింది.. రెండో రోజు పూర్తిగా 90 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా, 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. తొలి టెస్టులో ఆరంగ్రేటం చేసిన యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 113 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 312 పరుగుల భారీ స్కోరు చేసింది టీమిండియా. యశస్వి జైస్వాల్ 350 బంతుల్లో 14 ఫోర్లతో 143 పరుగులు చేసి క్రీజులో ఉంటే విరాట్ కోహ్లీ 96 బంతుల్లో ఒకే ఒక్క బౌండరీతో 36 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు.104 బంతుల్లో 7 ఫోర్లతో మొట్టమొదటి హాఫ్ సెంచరీ అందుకున్న యశస్వి జైస్వాల్, 215 బంతుల్లో 11 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆరంగ్రేటం టెస్టులో సెంచరీ చేసిన మూడో భారత ఓపెనర్‌‌గా నిలిచాడు యశస్వి జైస్వాల్. మ్యాచ్ ముగిసాక మీడియాతో ముచ్చటించాడు యశస్వి. ఆ వివరాలు మీకోసం.