9 ఏండ్ల తరువాత ఐపీఎల్... ధర్మశాల స్టేడియంలో నూతన ప్రత్యేకతలివే...
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియం మరింత అందగా తయారైంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల క్రికెట్ స్టేడియం మరింత అందగా తయారైంది. 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడ 2013లో చివరి ఐపీఎల్ మ్యాచ్ జరగగా.. IPL 2023 సీజన్‌లో రెండు మ్యాచ్‌లకు వేదిక కానుంది. పంజాబ్ కింగ్స్ (PBKS) ధర్మశాల స్టేడియాన్ని వారి సెకండ్ హోం గ్రౌండ్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ టీమ్ ఇక్కడ రెండు మ్యాచ్‌లను ఆడనుంది. మే 17న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 19న రాజస్తాన్ రాయల్స్‌తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. ఈ నేపథ్యంలో సుందరంగా ముస్తాబైన ధర్మశాల క్రికెట్ స్టేడియం విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..