Asianet News TeluguAsianet News Telugu

తూ.గో జిల్లాలో దారుణం... మహిళపై వైసిపి వర్గీయుల దాడి

రాజమండ్రి : అధికారుల సాయంతో తన సమస్యను పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తుంటే వైసిపి నాయకులు అడ్డుకున్నారని... ఇదేంటని ప్రశ్నిస్తే దాడికి దిగారని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేస్తోంది.  

రాజమండ్రి : అధికారుల సాయంతో తన సమస్యను పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తుంటే వైసిపి నాయకులు అడ్డుకున్నారని... ఇదేంటని ప్రశ్నిస్తే దాడికి దిగారని ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేస్తోంది.  పోలీసులు కూడా దాడిచేసిన వారిపై కాకుండా తననే నిర్భంధించారని... న్యాయం చేయాలంటూ మహిళ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలిపింది. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లాలో వెలుగుచూసింది. 

అనపర్తి మండలం పెడపర్తి గ్రామానికి చెందిన సుగుణ వరలక్ష్మి ఇంటి ఆవరణలో విద్యుత్ స్తంభం వుండేది. అయితే అధికారుల చుట్టూ తిరిగి ఎలాగోలా స్తంభాన్ని తన స్థలం నుండి తీసేయించుకున్నారు. ఈ విషయంలో అధికార వైసిపి సర్పంచ్ కాంతమ్మకు, వరలక్ష్మికి మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే తన వర్గీయులతో ఇంటివద్దకు చేరుకున్న కాంతమ్మ దాడికి తెగబడ్డారని వరలక్ష్మి చెబుతున్నారు.పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా తమనే నిర్బంధించారని బాధిత మహిళ వాపోయింది. విషయం తెలిసి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోలీస్ స్టేషన్ కు చేరుకుని బాధిత మహిళకు అండగా ఆందోళనకు దిగారు. చివరకు ఇరువు వర్గాలపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు.