పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత... గురజాల టిడిపి నేతలపై మారణాయుధాలతో దాడి

పల్నాడు : రాజకీయ దాడులతో పల్నాడ జిల్లా గురజాల  నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Share this Video

పల్నాడు : రాజకీయ దాడులతో పల్నాడ జిల్లా గురజాల నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురజాల మండలం జంగమేశ్వరపురం గ్రామంలో అధికార వైసిపి నాయకులు కొందరు ప్రతిపక్ష టిడిపి నాయకులు కరిముళ్ల రాజశేఖర్ రెడ్డి, సంకట నాగిరెడ్డి, గోపిరెడ్డిపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఒకరి పరిస్థితి విషయంగా వుండగా మిగతా ఇద్దరి కాళ్లు చేతులు విరిగాయి. వీరు ప్రస్తుతం గురజాల ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

టిడిపి, వైసిపి నాయకుల ఘర్షణతో జంగమేశ్వరపురంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడంతో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Related Video