వైసిపి ఎమ్మెల్యే మేకపాటికి గుండెపోటు... హుటాహుటిన అపోలోకు తరలింపు

నెల్లూరు : వైసిపి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

Share this Video

నెల్లూరు : వైసిపి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇవాళ ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి ఉదయం గుండె నొప్పితో బాధపడగా వెంటనే కుటుంబసభ్యులు హుటాహుటిన నెల్లూరు అపోలో హాస్పిటల్ కు తరలించారు. గుండెకు సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు మరింత మెరుగైన వైద్యం కోసం చెన్నై కి తరలించాలని సూచించారు. దీంతో మేకపాటి కుటుంబం ఆయనను చెన్నై తరలించేందుకు సిద్దమయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. 

Related Video