అదంతా ఎల్లో మీడియా రాజకీయం.. జగన్ కారు దిగడానికి కారణం అదే.. విజయసాయిరెడ్డి

విశాఖ గ్యాస్ లీక్ గ్రామాల్లో సోమవారం రాత్రి బస చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు.

Share this Video

విశాఖ గ్యాస్ లీక్ గ్రామాల్లో సోమవారం రాత్రి బస చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆ గ్రామాల్లో ఎలాంటి ఇబ్బంది లేదని భరోసా ఇవ్వడం కోసమే తాము రాత్రి అక్కడ బస చేసినట్టు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా విశాఖ గ్యాస్ లీక్ దుర్ఘటన సమయంలో తనను సీఎం జగన్ కారు నుంచి దించేశారన్న వార్తలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొట్టిపడేశారు. ఆ రోజు హెలికాప్టర్‌లో చోటు లేనందువల్లే తాను వెళ్లే కంటే రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెళ్లడమే ముఖ్యమని తాను దిగిపోయానని స్పష్టం చేశారు. దీన్ని ఎల్లో మీడియా రాజకీయం చేస్తుందని మండిపడ్డారు.

Related Video