సత్యవర్ధన్ ని బెదిరించి వంశీపై తప్పుడు కేసు: YS Jagan On Vallabhaneni Vamsi case | Asianet Telugu
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలో పర్యటించారు. విజయవాడ గాంధీనగర్‌లోని జిల్లా జైలులో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. జగన్ వెంట వైసీపీ నాయకులు కొడాలి నాని, తలశిల రఘురాం తదితరులు ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని జై జగన్, సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ములాఖత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ ఏ తప్పు చేయలేదని చెప్పారు. సత్యవర్ధన్ టీడీపీ నాయకులు బెదిరించి తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు.