Asianet News TeluguAsianet News Telugu

వైసిపి తరపున గెలిచి టిడిపికి మద్దతు... ఆకునూరులో ఉద్రిక్తత

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో వైసిపి-టిడిపి శ్రేణుల మధ్య వివాదం చోటుచేసుకుంది. 

First Published Feb 23, 2021, 4:18 PM IST | Last Updated Feb 23, 2021, 4:18 PM IST

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో వైసిపి-టిడిపి శ్రేణుల మధ్య వివాదం చోటుచేసుకుంది. వైసీపీ తరపున వార్డ్ సభ్యునిగా గెలిచి వ్యక్తి ఉపసర్పంచ్ ఎన్నికలో  టీడిపి మద్దతు దారునికి ఓటు వేయటంతో వివాదం రగిలింది. ప్రత్యర్థి అభ్యర్థికి ఓటు వేశానని తనపై దాడి చేయడమే కాదు బైక్, కారు, గోల్డ్ చైన్ లాక్కున్నారని సదరు వార్డు సభ్యుడు ఆరోపించాడు.  ఇరువర్గాలు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న సీఐ నాగ ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో శాంతించారు.