గుడివాడ శరత్ థియేటర్ వద్ద ఉద్రిక్తత... తన్నుకున్న వైసిపి, టిడిపి శ్రేణులు

గుడివాడ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

First Published Apr 14, 2023, 10:54 AM IST | Last Updated Apr 14, 2023, 10:54 AM IST

గుడివాడ : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో కృష్ణా జిల్లా గుడివాడలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసిపి కార్యాలయం శరత్ థియేటర్ మీదుగా చంద్రబాబు రోడ్ షో కొనసాగగా అంతకు ముందే అక్కడికి భారీగా వైసిపి నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. వైసిపి జెండాలు ప్రదర్శిస్తూ నినాదాలు చేసారు.ఈ క్రమంలోనే ఉద్రిక్తత చోటుచేసుకోగా ఓ దశలో టిడిపి, వైసిపి నాయకులు తన్నుకున్నారు. ఈ పరిస్థితిని ముందుగానే ఊహించి భారీగా మొహరించిన పోలీసులు ఇరువర్గాలను అదుపు చేసాయి.