పెళ్లి చేసుకోనన్నాడని.. అపార్ట్ మెంట్ పై నుంచి దూకి ప్రియురాలు ఆత్మహత్య..
విశాఖ పెందుర్తి చినముసిడివాడలో ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని, ప్రియుడి ఐదంతస్తుల అపార్ట్ మెంట్ నుండి దూకి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది.
విశాఖ పెందుర్తి చినముసిడివాడలో ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని, ప్రియుడి ఐదంతస్తుల అపార్ట్ మెంట్ నుండి దూకి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఒరిస్సా, రాయగడ్ ప్రాంతానికి చెందిన కావేటి వైష్ణవి అనే యువతి చిన్నముసిడివాడ ప్రాంతానికి చెందిన షణ్ముఖ తేజ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ విశాఖలోని ఒక ప్రైవేటు సంస్థలో వేరువేరుగా ఉద్యోగం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా వైష్ణవి గురువారం మధ్యాహ్నం తన ప్రియుడు తేజ చిన్నముసిడివాడ ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్ కు వచ్చింది. ఆ సమయంలో వీరు ఇరువురు గొడవపడి వైష్ణవి అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కేసుని పెందుర్తి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.