రిచ్ అవ్వాలని అనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే

Share this Video

గత పార్లమెంటు ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ పేరు మార్మోగిపోయింది. దేశంలోనే అత్యంత సంపన్న పార్లమెంటు సభ్యుడిగా ఆయన పాపులర్ అయ్యారు. జనరల్ ఎలక్షన్స్‌లో గుంటూరు ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రి పదవిని పొందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు రాజధాని ప్రాంతమైన అమరావతి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మరోవైపు ఆయన సతీమణి డాక్టర్‌ శ్రీరత్న కూడా అంతే ఫేమస్‌. ఆర్థిక పాఠాలు చెబుతూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ధనవంతులు కావాలన్నా, సంపాదనను ఆదా చేసుకోవాలన్నా ఇంటి బడ్జెట్‌ని ఎలా ప్లాన్‌ చేసుకోవాలి? ఖర్చులను ఎలా తగ్గించుకోవాలో వివరిస్తూ చక్కగా అవగాహన కల్పిస్తున్నారు శ్రీరత్న.

Related Video