అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి... పెళ్లీడు యువతితో అసభ్యంగా ప్రవర్తించిన వాలంటీర్

విజయవాడ: అర్థరాత్రి ఓ యువతి ఇంట్లోకి చొరబడి అసభ్యంగా వ్యవహరించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఓ గ్రామ వాలంటీర్. కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం మండలం కొండపల్లి పుట్లమ్మగట్టులో వాలంటీర్ నాగేంద్ర ఓ యువతి ఇంట్లో చొరబడ్డాడు. అయితే అతడు అసభ్య చేష్టలను గమనించిన యువతి కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడి వాలంటీర్ ను పట్టుకుని బంధించారు. పెళ్లీడు యువతితో అసభ్యంగా వ్యవహరించిన నాగేంద్రను శిక్షించాలని... యువతికి కూడా న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ నాగేంద్రపై  ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ లో ఇదే తరహా కేసు నమోదయ్యింది. 
 
Share this Video

Related Video