Asianet News TeluguAsianet News Telugu

నేటి నుంచి దుర్గగుడిలో అందరికీ ప్రవేశం.. కానీ.. షరతులు వర్తిస్తాయి...

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి సామాన్యులకు దర్శనాలు అనుమతించారు. 

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో నేటి నుంచి సామాన్యులకు దర్శనాలు అనుమతించారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి దర్శనం కోసం ఆన్లైన్ లో మాత్రమే టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టైమ్ స్లాట్ ప్రకారమే అమ్మవారి దర్శనం. గంటకి 250 మందికి అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. భక్తులకు తప్పనిసరిగా ఆధార్ కార్డ్, మాస్క్ తప్పనిసరి. 10సంవత్సరాలు లోపు, 65 సంవత్సరాలు నిండినవారు, గర్భిణులు దర్శనంకి రాకపోవటం మంచిదని అధికారులు చెబుతున్నారు. లిఫ్ట్ సౌకర్యం ఇంకా పునరుద్ధరించలేదు. క్యూ లైన్ లో నుంచి మాత్రమే అనుమతిస్తున్నారు. అన్నదానంలో పులిహోర, దద్దోజనం ప్యాకింగ్ చేసి పంపిణీ. కేశఖండనకు ఆన్లైన్ లోనే టికెట్స్ బుకింగ్ చేసుకోవాలి. కేశఖండన శాలలో గంటకి ముగ్గురికి మాత్రమే అనుమతి.