
పుల్లారావ్.. 30ఏళ్లు రాజకీయం చేస్తా: Vidadala Rajini Warning
టీడీపీ మాజీ మంత్రి, చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకి వైసీపీ మాజీ మంత్రి విడదల రజినీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తే సహించబోనని హెచ్చరించారు. ‘పుల్లారావ్.. నేనింకా 30 ఏళ్లు రాజకీయం చేస్తా.. నువ్వు ఎక్కడున్నా.. ఏ ఊరిలో దాక్కున్నా లాక్కొచ్చి వడ్డీతో సహా రిటర్న్ ఇచ్చేస్తా.. ఎవ్వరినీ వదిలపెట్టం.. అందరి సంగతీ తేలుస్తా..’ అంటూ విడదల రజినీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.