ఈ వెధవల్లాగే మేమూ సంపాదించాం...: దుట్టా, యార్లగడ్డకు ఎమ్మెల్యే వంశీ కౌంటర్

గన్నవరం : మాజీ మంత్రి కొడాలి నాని, , గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లపై వైసిపి నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు చేసిన తీవ్ర వ్యాఖ్యలు కృష్ణా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

Share this Video

గన్నవరం : మాజీ మంత్రి కొడాలి నాని, , గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లపై వైసిపి నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు చేసిన తీవ్ర వ్యాఖ్యలు కృష్ణా రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తమ గురించి యార్లగడ్డ, దుట్టా మాట్లాడిన మాటలను అదేస్థాయిలో తిప్పికొట్టారు వల్లభనేని వంశీ. పవిత్రమైన గుడికి వెళ్లి పిచ్చివాగుడు వాగినవారు మానసిక రోగులేనని అన్నారు. తాము ఇంత డబ్బు ఎలా సంపాదించామని అడుగుతున్నాడు... ఆ వెదవలంతా ఎలా సంపాదించారో మేము కూడా అలాగే సంపాదించామని వంశీ కౌంటరిచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో గడపగడపలో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ వైసిపి నేతలు దుట్టా, యార్లగడ్డ వీడియోపై స్పందించారు. పనిలేని పనికిమాలిన వెదవలు గుడికి వెళ్లి దిక్కుమాలిన వాగుడు వాగారని మండిపడ్డారు. ఈ మెంటల్ పేషెంట్స్ గురించి మాట్లాడే అవసరం తనకు, కొడాలి నానికి లేదన్నారు. తనతో కలిసి నడిస్తే అది దుట్టా అదృష్టం... లేదంటే ఆయన ఖర్మ అని వంశీ అన్నారు. 

Related Video