తలకిందులుగా నీటి బకెట్లో పడి.. రెండేళ్ల చిన్నారి మృతి..

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ తాలూకా రుద్రవరం మండలం చిత్తరేని పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.

Share this Video

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ తాలూకా రుద్రవరం మండలం చిత్తరేని పల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి రెండు సంవత్సరాల హారిక అనే చిన్నారి మృతి చెందింది. తల్లిదండ్రులు పని నిమిత్తం పొలం వెళ్లగా చిన్నారి ఆడుకుంటూ ఇంటి ముందర ఉన్న నీటి బకెట్లో తలకిందులుగా పడింది. ఆ పక్కన ఉన్న స్థానికులు గమనించి బకెట్లో పడిన చిన్నారిని బయటికి తీసిలోపే ఊపిరాడక పాప ప్రాణాలు కోల్పోయింది. చిన్నారి మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

Related Video