Asianet News TeluguAsianet News Telugu

ఆడుకుంటూ చెరువులో పడిపోయి ఇద్దరు చిన్నారులు మృతి...

పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మండలం  జమదల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. 

First Published Sep 23, 2022, 9:33 AM IST | Last Updated Sep 23, 2022, 9:33 AM IST

పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మండలం  జమదల గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు ఆడుకుంటూ చెరువులో పడిపోయి మృతి చెందారు. మృతి చెందిన చిన్నారులు జానకి(4), కృష్ణ ప్రసాద్(2) లుగా గుర్తించారు. చిన్నారులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వెతకగా.. చెరువు దగ్గర కనిపించారని తెలిసింది. వీరు వెళ్లేసరికే పిల్లలు చెరువులో పడిపోయారు. దీంతో ఓ చిన్నారి తల్లి స్వయంగా చెరువులోకి దిగి పిల్లల్ని బయటికి తీసింది. అప్పటికే వారు మృతి చెందారు. ఇద్దరు చిన్నారులు మృతితో గ్రామంలో విషాధచాయలు నెలకొన్నాయి.