Tuni Municipal Elections: ఛీ.. ఇంతకి తెగబడతారా?: కూటమి ప్రభుత్వంపై కన్నబాబు ఫైర్ | Asianet Telugu
కాకినాడ జిల్లా తునిలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తునిలో టిడిపి దుర్మార్గంగా ప్రవర్తించి మున్సిపల్ వైస్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకుందన్నారు. పోలీసుల సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ లను కిడ్నాప్ చేయాలనుకున్నారని ఆరోపించారు. యనమల రామకృష్ణుడు ఇలాంటి దౌర్జన్యాలను ప్రోత్సహిస్తున్నారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టిడిపికి సహకారం అందిస్తున్న పోలీసులపై అధికారులు, ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తునిలో శాంతియుత వాతావరణం కల్పించి హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలను సజావుగా జరిపించాలని... లేకుంటే తామంతా తుని వెళ్తామని హెచ్చరించారు.