
టీటీడీకి భారీ విరాళం: రూ.9కోట్లు దానమిచ్చిన మంతెన రామలింగరాజు
తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందింది. పీఏసీ 1, 2 & 3 భవనాల ఆధునీకరణ కోసం మంతెన రామలింగ రాజు రూ.9 కోట్లు విరాళంగా అందజేశారు. 2012లో కూడా ఈయన రూ.16 కోట్లు విరాళమిచ్చి భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం విశేష సేవ చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అభినందనలు తెలిపారు. స్వామివారి అనుగ్రహం ఆయన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.