తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం జగన్ ను ఆహ్వానించిన టిటిడి...

తిరుపతి : త్వరలో జరగనున్న తిరుమల వెకటేశ్వరస్వామివార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సింది ముఖ్యమంత్రి జగన్ టిటిడి ఆహ్వానం అందించింది.

First Published Sep 21, 2022, 5:32 PM IST | Last Updated Sep 21, 2022, 5:36 PM IST

తిరుపతి : త్వరలో జరగనున్న తిరుమల వెకటేశ్వరస్వామివార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సింది ముఖ్యమంత్రి జగన్ టిటిడి ఆహ్వానం అందించింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రిని కలిసిన టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎంను శాలువాతో సత్కరించిన టిటిడి ఛైర్మన్ స్వామివారి ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేసారు. ఈ నెల 27 నుండి అక్టోబరు 5వ తేదీవరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించాల్సింది టిటిడి అధికారులు సీఎం జగన్ ను కోరారు. 

మహాకవి గురజాడ అప్పారావు 160వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని ఎమ్మెల్యే భూమన ఐదు వేల కాపీలు ముద్రించారు. ఈ కాపీలను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. విజయనగరంలోని గురజాడ ఇంటికి కాపీలను బహుకరించి సందర్శకులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే భూమన తెలిపారు.