సత్తెనపల్లిలో దారుణం... హిజ్రాను రాళ్లతో కొట్టిచంపిన దుండగులు
గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని వెంకటపతి కాలనీలో ఓ హిజ్రాను గుర్తుతెలియని దుండగులు అతి దారుణంగా చంపారు. రాళ్లతో కొట్టిచంపడంతో హిజ్రా ముఖం గుర్తుపట్టలేనంతలా తయారయ్యింది. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.